జై హను మాన్ లో హీరో పై ప్రశాంత్ వర్మ క్లారిటీ!

జై హను మాన్ లో హీరో పై ప్రశాంత్ వర్మ క్లారిటీ!

Published on Jan 22, 2024 9:07 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం కి సంబందించిన సీక్వెల్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి సీక్వెల్ అయిన జై హను మాన్ వచ్చే ఏడాది జనవరి లో రిలీజ్ కానుంది.

అయితే ఈ మూవీ పై మరోసారి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జై హను మాన్ మూవీ లో తేజ సజ్జ హీరో కాదు అని, హనుమంతు గా సినిమాలో ఉంటాడు అని, హీరో ఆంజనేయ స్వామి అని, ఒక పెద్ద యాక్టర్ ఆ పాత్ర చేస్తారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ యాక్టర్ ఎవరనే దానిపై త్వరలో క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు