భీష్మ లో సెకండ్ హీరోయిన్ గురించి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !

Published on Apr 17, 2019 9:17 am IST

యువ హీరో నితిన్ తో ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల ‘బీష్మ’ అనే చిత్రం తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నాడు డైరెక్టర్. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటించనుంది. అయితే నిన్న ఈ చిత్రంలో రష్మిక తో పాటు మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ మరో హీరోయిన్ గా నటించనుందని వార్తలు వచ్చాయి. దాంతో ఈ వార్తల ఫై వెంకీ కుడుముల ట్విట్టర్ ద్వారా స్పందించాడు.

ఈ సినిమాలో రష్మిక మాత్రమే హీరోయిన్ అని సెకండ్ హీరోయిన్ లేదని త్వరలోనే సినిమా లో నటించే నటీనటులను , సాంకేతిక నిపుణలను ప్రకటిస్తామని తెలిపారు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నఈ చిత్రాన్ని సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మించనుంది.

సంబంధిత సమాచారం :