కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ ఔటింగ్ చిత్రమే “కరుప్పు”. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో “వీర భద్రుడు” గా విడుదల అయ్యి సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ చిత్రంలో సూర్య కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన సాలిడ్ టైటిల్ కార్డ్ కి థియేటర్స్ లో మాస్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఇలాంటివి దాదాపు ఫ్యాన్స్ డిమాండ్ మేరకు థియేట్రికల్ రిలీజ్ తర్వాతే ఆన్లైన్ లో వస్తాయి. కానీ సూర్య అభిమానుల కోసం దర్శకుడు ప్రత్యేకంగా ముందే దీని అఫీషియల్ వీడియోని రిలీజ్ చేసి మరో గిఫ్ట్ గా తాను అందించాడు. దీనితో ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఈ వీడియోతో సూర్య ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకార్ సంగీతం అందించగా త్రిష హీరోయిన్ గా ఆర్జే బాలాజీ విలన్ గా ఈ సినిమాలో నటించారు. అలాగే డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణం వహించిన ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.
This is for you all the Anbaana Fans from team #Karuppu !!!❤️❤️❤️
The One @Suriya_offl is here 🔥🔥🔥 pic.twitter.com/3Dg6a017Qf— RJ Balaji (@RJ_Balaji) May 18, 2026


