“వకీల్ సాబ్”తో ముఖ్యంగా వారికే గట్టి ఆన్సర్ ఇచ్చిన దర్శకుడు.!

Published on Apr 15, 2021 5:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశారు. అయితే వాటిలో తన స్టార్డం కు తగ్గ హిట్స్ గా నిలిచినవి ఇప్పట్లో చాలా తక్కువే ఉన్నాయి. కానీ లేటెస్ట్ “వకీల్ సాబ్” చూసాక మాత్రం జెనరల్ ఆడియెన్స్ నుంచి పవన్ అభిమానులు వరకు అతన్ని ఎలా చూడాలి అనుకున్నారో అంతకు మించే ఎస్టాబ్లిష్ చేసిన ఘనత ఒక్క దర్శకుడు శ్రీరామ్ వేణుకే దక్కుతుంది అని చెప్పడం నిస్సందేహం.

అయితే పవన్ ఎన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ రీమేక్స్ ఎక్కువ ఎంచుకుంటూ వస్తూ ఉండడం వల్ల ఒక వెలితి ఆడియెన్స్ లో ఉంది. అంత స్టార్డం ఉండి ఇంకా రీమేక్స్ ఎందుకు తన స్టార్డంతో ఓ కొత్త కథనే చెప్పొచ్చు కదా అని అభిప్రాయ పడే అభిమానులు కూడా కూసింత ఎక్కువే పవన్ కు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు పవన్ చేసిన ఏ రీమేక్ కి ఇవ్వని హై ని దర్శకుడు శ్రీరామ్ “వకీల్ సాబ్”తో ఇచ్చాడు.

అలాగే ఇక్కడ మెయిన్ గా మాత్రం పవన్ అభిమానులకే గట్టి ఆన్సర్ ఇచ్చాడని చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ చిత్రం “పింక్” అనే సబ్జెక్ట్ తెలుగులో పవన్ స్టార్డం కి స్కోప్ ఇచ్చే అంత రేంజ్ ఉండేది కాదు అని ఓ స్టేజ్ లో అయితే పవన్ కం బ్యాక్ సినిమా అయినప్పటికీ ఓటిటిలో ఇచ్చేసినా పర్లేదు అని ఫీలయిన అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు.

కానీ అలాంటి సున్నితమైన సబ్జెక్టును కూడా పవన్ ఇమేజ్ కి ఎలాంటి డ్యామేజ్ జరగ్గకుండా హ్యాండిల్ చేసి అలాంటి అభిప్రాయం ఉన్న ఒక్కొక్కరికి అదిరే ఆన్సర్ ను డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఇచ్చాడు. ఇదే హై లో పవన్ మరోసారి ఛాన్స్ ఇస్తే మళ్ళీ మంచి మాస్ ఫీస్ట్ ను ఎలాంటి సబ్జెక్ట్ తో అయినా ఇవ్వడం గ్యారంటీ అని చెప్పాలి. ఫైనల్ గా మాత్రం పవన్ కల్ట్ ఫ్యాన్స్ అయిన నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, దర్శకుడు వేణు వేరే లెవెల్ మాస్ ను చూపించారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :