ఎన్టీఆర్ విడుదల తేదిని ప్రకటించిన తేజ !

ఎన్టీఆర్ బయోపిక్ ఈరోజు రామకృష్ణ స్టుడియోలో ప్రారంభమయ్యింది. ముహూర్తం సన్నివేశంలో బాలయ్య ధుర్యోదనుడిగా కనిపించారు. బాలయ్యతో పనిచేసిన నిర్మాతలు, దర్శకులు పలువురు ఈ ప్రారంభ మహోత్సవానికి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ.. సినిమా కథ బాగా వచ్చింది. ఈ ఏడాది దసరాకు సినిమాను విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. విష్ణు ఇందురి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలు ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది.

Exit mobile version