చిత్రం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన తేజ తాజాగా రానా తో నేనేరాజు నేనే మంత్రి సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ వెంకటేష్, బాలయ్యతో సినిమాలు చేస్తున్నాడు. కొంతకాలం వెనక్కు వెళ్ళితే… 2001 లో తేజ డైరెక్ట్ చేసిన ఫ్యామిలి సర్కస్, నువ్వు నేను సినిమాలు వచ్చాయి. ఆ తరువాత 2015లో ధైర్యం, ఔనన్నా కాదన్న సినిమాలో వచ్చాయి.
తాజాగా తేజ దర్శకత్వం వహిస్తోన్న రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కాబోతున్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా దసరాకు విడుదల కాబోతోంది. ఈ సినిమాతో పాటు వెంకటేష్ సినిమా ఇదే ఏడాదిలో విడుదల కాబోతుండడం విశేషం. యాదృచ్చికంగా తేజ దర్శకత్వం వహించిన రెండు సినిమాలు మూడోసారి ఒకే ఇయర్ లో విడుదల కానున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ కు కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా.. వెంకటేష్ సినిమాకు అనుప్ సంగీతం సమకూరుస్తున్నాడు.


