భయంకరమైన అడవుల్లో దర్శకుడు తేజ నెక్స్ట్ సినిమా.

TEJA
ఒకప్పుడు వరుసగా కొత్త నటినటులను పరిచయం చేస్తూ సినిమాలు చేసిన తేజ, గత కొంత కాలం నుండి సైలెంట్ అయ్యారు. తేజ చివరి సినిమా ‘1000 అబద్దాలు’ విడుదలై ఏడాది దాటింది. తర్వాత మరొ కొత్త సినిమాను ఇప్పటివరకు ప్రారంభించలేదు. తాజాగా ఓ సాహసోపేతమైన కథను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను తీయడం ఒక రకంగా రిస్క్ అని చెప్పాలి.
కర్ణాటకలో భయంకరమైన అటవీ ప్రాంతం ‘అగుంబే’ కొండకోనల్లో నెల రోజుల పాటు తన కొత్త సినిమా షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొండలు ప్రమాదకరమైన కోబ్రాలు తిరిగే చోటు. ఎప్పుడు వర్షం కురుస్తుంది. ఈ కొండల్లో వివిధ రకాల కోబ్రాలు సంచరిస్తున్నాయని.. కోబ్రాలపై పరిశోధన చేసే కేంద్రం కూడా స్థాపించారు. అయితే, తను రాసుకున్న స్క్రిప్ట్ కు అత్యంత అనువైన ప్రదేశం అదేనని తేజ ఫిక్స్ అయ్యారు. తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నామని చెప్పారు.

ఇంత రిస్క్ చేసి తేజ సినిమా తీయడానికి రెడీ అయ్యారంటే, కథ ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఫిల్మ్ నగర్ వాసుల్లో మొదలైంది.

Exit mobile version