ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న “డైరెక్టర్” ట్రైలర్.!

ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న “డైరెక్టర్” ట్రైలర్.!

Published on Feb 24, 2021 4:10 PM IST

మన తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త టాలెంట్ కు ఎలాంటి కొదవా లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త నటీనటులు దర్శకులు వస్తూనే ఉంటారు. మరి అలా ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టునే “డైరెక్టర్” అనే సినిమా యూనిట్ తెస్తున్నట్టు అనిపిస్తుంది. ఆశిష్ గాంధీ హీరోగా ఐశ్వర్య రాజ్ భకుని హీరోయిన్ గా కిరణ్ పొన్నాడ మరియు కార్తీక్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “డైరెక్టర్”. ఇప్పుడు ఈ సినిమా తాలూకా ట్రైలర్ ను మేకర్స్ వదిలారు.

ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఇది ఒకింత కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. తన సరికొత్త కథలతో ఎలా అయినా ఓ సినిమా డైరెక్టర్ గా అవ్వాలని అనుకునే రోల్ లో ఆశిష్ కనిపించాడు. కానీ అందులో మాత్రం కాస్త వైవిధ్యం కనిపిస్తుంది. సినిమా నుంచి తన లైఫ్ లో జరిగే కొన్ని కీలక చర్యలు మరో హర్రర్ కోణాన్ని చూపిస్తున్నాయి. కేవలం అతడికి మాత్రమే కనిపించే పాత్ర కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ ఐశ్వర్య రాజ్ మంచి గ్లామరస్ గా చక్కగా ఇందులో కనిపించింది.

ఇక అలాగే సాయి కార్తీక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇందులో మంచి ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాలి. అలాగే ఆదిత్య వర్ధన్ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. కానీ లాస్ట్ బట్ లీస్ట్..హీరో లుక్స్ కోసం చెప్పాలి. లాస్ట్ ఒక బిట్ లో అయితే కన్నడ రాకింగ్ స్టార్ యష్ లా ఆ గడ్డం మరియు హెయిర్ స్టైల్ లో కనిపించి కాస్త అలా తాను అనిపించాడు. మరి ఇది తనకి ప్లస్ గా నిలుస్తుందో మైనస్ గా నిలుస్తుందో చూడాలి. ఓవరాల్ గా మాత్రం ఈ ట్రైలర్ ఒకింత ఆసక్తిగా ఉంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు