వెంకీ – నితిన్ కథ ఇదేనా ?

‘ఛలో ‘భీష్మ సినిమాలతో తన ఖాతాలో భారీ విజయాలను నమోదు చేసుకున్నాడు వెంకీ కుడుముల. తాజాగా హీరో నితిన్ తో వెంకీ కుడుముల మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కథ ఓ ప్రాణాంతకమైన డిసీజ్ తో చావుకి దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి కథ అట. మరో నెల రోజుల్లో చనిపోతాను అని తెలుసుకున్న వ్యక్తి ఎలా ఫీల్ అయ్యాడు ?, తన జర్నీని ఎంత హ్యాపీగా మార్చుకున్నాడు?, చుట్టూ ఉన్న జనం అతని పై చూపించే సింపతీకి అతను ఎలా ఇరిటేట్ అయ్యాడు ? అనే కోణంలో వెంకీ కుడుముల ఈ పాయింట్ ను ఫన్నీ వే లో చూపించబోతున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని.. నితిన్ కి కూడా పూర్తి కథ బాగా నచ్చిందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ తారాగణంతో భారీ స్థాయిలో నిర్మించబోతుంది. ఎలాగూ భీష్మ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ తర్వాత సినిమా పై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది. అన్నిటికీ మించి భీష్మ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి.. వెంకీ కుడుముల – నితిన్ ల కాంబినేషన్ పై మంచి అంచనాలు ఉంటాయి. మరి వీరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.

Exit mobile version