వి.వి.వినాయక్ చేతుల మీదుగా ‘థాంక్యూ డియర్’ టీజర్ విడుదల

thanku

మహాలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై పప్పు బాలాజీ రెడ్డి నిర్మిస్తున్న ‘థాంక్యూ డియర్’ చిత్రానికి తోట శ్రీకాంత్ కుమార్ రచన, దర్శకత్వం వహించారు. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా, పి.ఎల్.కె. రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ, శ్రీహరి గారి కుటుంబం నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రికి, అలాగే హెబ్బా పటేల్, రేఖా నిరోషాలకు ఈ సినిమా గొప్ప విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. శ్రీహరి ఆశీస్సులతో ధనుష్ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.

హీరో ధనుష్ రఘుముద్రి, హీరోయిన్ రేఖ నిరోషా తమ సినిమా టీజర్‌ను వినాయక్ లాంచ్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రేక్షకుల మద్దతు కోరారు.

Exit mobile version