‘డర్టీ హరి’ రియల్లీ డర్టీ గా ఉన్నాడే..!

‘డర్టీ హరి’ రియల్లీ డర్టీ గా ఉన్నాడే..!

Published on Jan 4, 2020 11:53 AM IST

DirtyHari 1

ఒక్కడు, వర్షం, మనసంతా నువ్వే వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ నిర్మించిన సీనియర్ నిర్మాత ఎం ఎస్ రాజు తూనీగ తూనీగ, వాన వంటి చిత్రాలకు దర్శకత్వం కూడా చేశారు. ఐతే దర్శకుడిగా ఆయన విజయం సాధించలేదు. ఆయన తీసిన రెండు ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ పరాజయం పాలయ్యాయి. దాదాపు 12ఏళ్ల తరువాత ఈయన మళ్ళీ మెగా ఫోన్ పట్టుకున్నారు. డర్టీ హరి అనే ఒక బోల్డ్ కాన్సెప్ట్ మూవీకి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా చూడటానికి చాలా బోల్డ్ గా ఆసక్తికరంగా ఉంది. బాత్ టబ్ లో అబ్బాయి నోట్లో ఓ అమ్మాయి కాలితో సిగరెట్ పెడుతున్న ఆ పోస్టర్ చూస్తుంటే మూవీ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.

నూతన నటుడు శ్రవణ్ రెడ్డి హీరోగా ఈ చిత్రంతో పరిచయం అవుతుండగా ఎస్ పి జె క్రియేషన్స్ బ్యానర్ లో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మిస్తున్నారు. ఎం ఎస్ రాజు ట్రెండ్ కి అనుకూలంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రమైనా ఆయనకు దర్శకునిగా మొదటి విజయం అందిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు