‘డిస్కోరాజా’ భారీ ఓపెనింగ్స్ సాధించాల్సిందే !

Published on Jan 22, 2020 7:06 am IST

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మాణంలో రాబోతున్న తాజా చిత్రం ‘డిస్కోరాజా’. ఈ సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ చిత్రం ట్రైలర్ కూడా బాగుండటంతో సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే 34 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో అత్యధికమైన బడ్జెట్ తో నిర్మించారు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవాలంటే ఘనమైన ఓపెనింగ్స్ ను సాధించాల్సి ఉంది.

కాగా ఈ చిత్రం జనవరి జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ , తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, సినిమాకు బాగా ప్లస్ అవుతున్నాయని చిత్రబృందం చెబుతుంది.

సంబంధిత సమాచారం :