యాక్షన్ మూడ్ లో ‘డిస్కోరాజా’ !

యాక్షన్ మూడ్ లో ‘డిస్కోరాజా’ !

Published on Jul 7, 2019 9:40 AM IST

వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రాబోతున్న చిత్రం “డిస్కోరాజా”. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దాదాపు 70 % షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుందట. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో క్లైమాక్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. క్లైమాక్స్ లో రవితేజ్ ఫుల్ యాక్షన్ మూడ్ లో కనిపిస్తాడట.

ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిర్మాత‌ రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు