‘డిస్కోరాజా’ సరసన హాట్ బ్యూటీ !

‘డిస్కోరాజా’ సరసన హాట్ బ్యూటీ !

Published on Jul 9, 2019 7:19 PM IST

వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రాబోతున్న చిత్రం “డిస్కోరాజా”. అయితే ఈ చిత్రంలో ర‌వితేజ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ ఇప్పటికే షూట్ లో కూడా పాల్గొన్నారు. కాగా తాజాగా మూడో హీరోయిన్‌ ను కూడా చిత్రబృందం ఫైనల్ చేసింది. తాన్యా హోప్‌ ను మూడో హీరోయిన్ గా ఎంపిక చేశారు. సినిమాలో తాన్యా హోప్‌ రోల్ కాస్త బోల్డ్ గా ఉంటుందట. ఆమె పై ఒక మసాలా సాంగ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

కాగా గ్లామ‌ర్ పరంగా తాన్యా హోప్ కి తిరుగులేకపోయినా.. ఆమెకు పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. కనీసం ‘డిస్కోరాజా’తోనైనా తాన్యా హోప్ కి కాలం కలిసి వస్తోందేమో చూడాలి. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత‌ రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు