డిస్కో రాజా లో ఒక్క సీన్ కోసం అన్ని కోట్లా…!

Published on Sep 16, 2019 5:32 pm IST

మాస్ మహారాజ్ రవి తేజ హీరో గా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డిస్కో రాజా. నిర్మాత రామ్ తళ్ళూరి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా గోవా లో 15 రోజులు పాటు కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేసుకొని వచ్చింది. మాస్ మహారాజ్ రవి తేజ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే గోవా షెడ్యూల్ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్ కొరకు ఫారిన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. యూరోప్ లోని ఐస్ ల్యాండ్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేసిన దర్శకుడు ఈ షెడ్యూల్ కోసం భారీ గా ఖర్చు చేస్తున్నట్లు వినికిడి.

హాలీవుడ్ సూపర్ సక్సెస్ సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7కి పనిచేసిన స్టంట్ మాస్టర్స్ టీం డిస్కో రాజా యాక్షన్ సన్నివేశాలకు పనిచేయనుందట. మరో విశేషం ఏమిటంటే నాలుగు నిమిషాల నిడివి మాత్రమే ఉండే ఆ యాక్షన్ సన్నివేశం కోసం దాదాపు 4 నుండి 5కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చుచేయనున్నారట. డిసెంబర్ 20న డిస్కో రాజా విడుదల కాబోతుంది.రవి తేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, హాట్ బ్యూటీ తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More