అన్ని విధాలా ఆకట్టుకునేలా ‘డిస్కో రాజా’ టీజర్

అన్ని విధాలా ఆకట్టుకునేలా ‘డిస్కో రాజా’ టీజర్

Published on Dec 1, 2019 9:13 AM IST

మాస్ మహారాజ రవితేజ ప్రజెంట్ విఐ ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజా’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై రవితేజ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయన అభిమానులు సైతం ఈ చిత్రం ద్వారా తమ హీరో పూర్వపు ఫామ్లోకి వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర టీమ్ సినిమా టీజర్ ను సిద్దం చేశారు. డిసెంబర్ 6వ తేదీన ఈ టీజర్ విడుదల చేయనున్నారు.

సినిమా నుండి వస్తున్న ఫస్ట్ ఔట్ పుట్ కావడంతో టీజర్ అన్ని విధాలా ఆకట్టుకునేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు టీమ్. నాభ నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండగా బాబీ సింహ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రేక్షకులకు అందివ్వనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు