‘డిస్కో రాజా’ సంగతేంటో రేపైనా తెలుస్తుందా ..!

‘డిస్కో రాజా’ సంగతేంటో రేపైనా తెలుస్తుందా ..!

Published on Dec 5, 2019 11:12 PM IST

రవి తేజా డిస్కో రాజా మూవీపై అటు అభిమానులలో మరియు మూవీ లవర్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. దీనికి కారణం ఈ మూవీ కథ ఫిక్షనల్ ఫాంటసీ స్టోరీ అని చెప్పడమే. ఇప్పటికే విడుదలైన కొన్ని పోస్టర్స్ లో రవితేజ డాన్ లుక్ లో కనిపించారు. అలాగే కొన్ని గెటప్స్ మరియు విడుదలైన సాంగ్స్ చూస్తుంటే ఇందులో కొంత పీరియాడిక్ డ్రామాగా కూడా నడుస్తుందని తెలుస్తుంది. రవితేజ రివేంజ్ తీర్చుకోవడానికి సీరియల్ కిల్లర్ గా మారతాడని కూడా వినిపిస్తుంది.

ఐతే రేపు ఈ అనుమానాలన్నింటికీ తెరపడే అవకాశం కలదు. ఎందుకనగా రేపు సాయంత్రం 4గంటలకు డిస్కో రాజా టీజర్ విడుదల కానుంది. ఈమేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేశారు. కాబట్టి టీజర్ చూస్తే రవితేజ పాత్ర మరియు సినిమా నేపథ్యంపై ఓ అవగాహన వచ్చే అవకాశం కలదు. ఇక దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు