విడాకులకు పూరి పరిష్కార మార్గాలు !

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తన పూరీ మ్యూజింగ్స్‌ లో భాగంగా ఈ రోజు ‘విడాకులు’ అనే అంశం గురించి చెప్పుకొచ్చాడు. పూరి మాటల్లో.. ‘పాండమిక్ త‌ర్వాత చాలామంది విడాకులకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ‘మగవాళ్ళు.. ఆడవాళ్లు ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోవడం సమయం గడపడం వలన ఈ లాక్ డౌన్ సమయంలో గొడవలు అయి, ప్రపంచంలోనే అత్యధిక విడాకులు ఈ కరోనా సమయంలోనే అయ్యాయి” అంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.

భారత్ లో విడాకులు తీసుకుంటున్న రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లు టాప్ 3లో ఉన్నాయట. గత సంవత్సరం లాక్ డౌన్ నుంచి ఇప్పటిదాకా రోజుకు 25 విడాకుల కేసులు ఫైల్ అవుతున్నాయట. పూరి ఈ విడాకుల సమస్యకు ఒక పరిష్కారం ఇచ్చాడు. దంపతులు ఒకరితో ఒకరు తక్కువ సమయం గడపండి. ఎక్కువ మాట్లాడకండి. ఈ కష్ట సమయాల్లో మీ వివాహ బంధాలనీ కాపాడుకోండి” అంటూ పూరి తనదైన శైలిలో సలహాలు ఇస్తున్నాడు.

అలాగే మీరు పెళ్ళికి ముందు ఒంటరితనం అనుభూతి చెందుతున్నట్లయితే అసలు పెళ్లే చేసుకోవద్దు అంటున్నాడు. పెళ్లి తర్వాత కూడా మీకు ఒంటరితనం లభిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 2040 నాటికి కేవలం 30% వివాహాలు మాత్రమే జరుగుతాయట.

Exit mobile version