ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ దిశగా వెళుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమాని కూడా ఇటీవల జపాన్ లో రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ సినిమాల కోసం ఆసక్తికర వార్తలు బయటకి వస్తుండగా తనపై ఓ షాకింగ్ వార్త కూడా తాజాగా బయటకి వచ్చి వైరల్ గా మారింది. సినిమా సెట్స్ లో అల్లు అర్జున్ తో ఇలా ఉండకూడదు అలా ఉండాలి. తన వంక సూటిగా చూడకూడదు. ఇలా చాలానే షాకింగ్ అంశాలు వినిపించాయి.
అయితే ఈ వార్తలపై లేటెస్ట్ గా అల్లు అర్జున్ టీం నుంచి అధికారిక క్లారిటీ బయటకి వచ్చింది. ఒక అధికారిక ప్రెస్ నోట్ ని విడుదల చేసి అల్లు అర్జున్ విషయంలో జరుగుతున్న ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వారు ఖండించారు. అంతే కాకుండా అల్లు అర్జున అందరితో ఎంతో మర్యాదపూర్వకంగానే ఉంటారని ఇందులో తెలిపారు. ఇక దీనితో పాటుగా తనపై ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.
An official note from Icon star @alluarjun’s Office.
A recent video spreading baseless allegations about @alluarjun is completely false. The matter is being taken seriously, and legal action is being initiated against those responsible. Kindly refrain from sharing unverified… pic.twitter.com/sXhSNRsB36— Team Allu Arjun (@TeamAAOfficial) February 10, 2026
