మీకు తెలుసా? : “దేవదాసు” కి ముందు ఇలియానా మిస్ చేసుకున్న సినిమా

మీకు తెలుసా? : “దేవదాసు” కి ముందు ఇలియానా మిస్ చేసుకున్న సినిమా

Published on Apr 23, 2024 8:05 PM IST

టాలీవుడ్ సినిమా దగ్గర కొన్నేళ్లు వెనక్కి వెళితే హీరోయిన్స్ విషయంలో ఓ సరికొత్త ట్రెండ్ మార్క్ ని సెట్ చేసిన హీరోయిన్స్ లో ఇలియానా కూడా ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తో “పోకిరి” తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన తాను తెలుగులో అప్పట్లో 1 కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న మొట్ట మొదటి హీరోయిన్ అని ఆమె పేరు మారు మోగింది.

అయితే ఇలియానా తెలుగులో అడుగు పెట్టడమే భారీ హిట్ చిత్రం “దేవదాసు” తో ఎంట్రీ ఇచ్చింది. యంగ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) కూడా హీరోగా తెలుగు తెరకి పరిచయం ఈ సినిమా తోనే కదా వై వి ఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. అయితే ఈ యంగ్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. అక్కడ నుంచే ఇలియానా పేరు ఇండస్ట్రీలో పాకింది.

అయితే నిజానికి ఇలియానా తెలుగులో చేయాల్సిన మొదటి సినిమా ఇది కాదట. దీనికి ముందే యంగ్ హీరో నితిన్ (Nithiin) తో సినిమాని ఆమె చేయాల్సి ఉందట. దర్శకుడు తేజ నితిన్ కాంబినేషన్ లో వచ్చిన “ధైర్యం” సినిమాతో ఆమె టాలీవుడ్ లో పరిచయం కావాల్సి ఉందట. ఆ సినిమాకి ఆడిషన్ కూడా ఇచ్చి 3 నెలలు అలా డేట్స్ ఇచ్చిందట.

కానీ పలు కారణాలు చేత ఇలియానా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ధైర్యం సినిమా 2005 లో రాగా దేవదాసు సినిమా 2006 లో వచ్చింది. ఇక ఈ హిట్ తర్వాత “పోకిరి” ఆ తర్వాత ఇలియానా ఏ రేంజ్ స్టార్డం తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు