ఇది మీకు తెలుసా? “పోకిరి” సినిమాకి మరో టైటిల్.. మహేష్ పేరు కూడా వేరే

ఇది మీకు తెలుసా? “పోకిరి” సినిమాకి మరో టైటిల్.. మహేష్ పేరు కూడా వేరే

Published on Apr 21, 2024 1:01 PM IST

సూపర్ స్టార్ నుంచి ఇప్పుడు గ్లోబల్ లెవెల్లోకి వెళ్ళబోతున్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన “పోకిరి” కోసం తెలిసిందే. మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సౌత్ ఇండియా సినిమా రికార్డులు తిరగరాసి అప్పటివరకు తెలుగు సినిమా చూడని కనీ వినీ ఎరుగని బ్రహ్మాండమైన రన్ ని కొనసాగించింది.

అయితే ఈ సినిమా ఎంత పక్కా మాస్ గా మహేష్ పాత్ర కూడా ఎంత ఐకానిక్ గా ఉంటుందో తెలిసిందే. అలాగే పూరి జగన్నాథ్ సినిమాలు అంటే అప్పట్లో కూడా ఒక ట్రెండే.. ఆ మాస్ టైటిల్స్ కోసం కూడా బాగా మాట్లాడుకునేవారు. అలానే “పోకిరి” టైటిల్ కి ప్రస్తావన వచ్చింది. అయితే ఇది మీకు తెలుసా? పోకిరి సినిమాకి కానీ అందులో మహేష్ బాబు పేరు కూడా వేరే అట.

ఈ చిత్రానికి ముందుగా “ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ” అనే టైటిల్ ని అనుకున్నారట. అంటే మనం చూసిన పోకిరి ప్లేస్ లో ఆ టైటిల్ అలాగే మహేష్ పేరు కూడా కృష్ణ మనోహర్ ప్లేస్ లో ఉత్తమ్ సింగ్ అని ఉండేది. కానీ తర్వాత కొన్ని మార్పులు చేర్పులు తర్వాత సినిమా “పోకిరి” గా రికార్డులు బద్దలు కొట్టింది.

ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ (SSMB 29) లో బిజీగా ఉండగా పూరీ రామ్ పోతినేని (Ram Pothineni) తో “డబుల్ ఇస్మార్ట్” (Double Ismart) ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. మరి వీరి కాంబినేషన్ లో అయితే మూడో సినిమా కోసం అభిమానులు ఎపుడో నుంచో వెయిట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు