ఇది మీకు తెలుసా? “వర్షం” సినిమాలో త్రిష ప్లేస్ లో ఆ హీరోయిన్ అనుకున్నారట

ఇది మీకు తెలుసా? “వర్షం” సినిమాలో త్రిష ప్లేస్ లో ఆ హీరోయిన్ అనుకున్నారట

Published on Apr 18, 2024 8:22 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాని ఎలా రూల్ చేస్తున్నాడో చూస్తున్నాం మరి తన యంగ్ ఏజ్ లో చేసిన సినిమాల్లో పలు భారీ హిట్స్ కూడా ఉన్నాయి. ఈ చిత్రాల్లో దర్శకుడు శోభన్ తెరకెక్కించిన చిత్రం “వర్షం” కూడా ఒకటి. మరి త్రిష హీరోయిన్ గా గోపీచంద్ విలన్ గా నటించిన ఈ సినిమా ప్రభాస్ మార్కెట్ ని కూడా ఓ రేంజ్ లో పెంచగా లేటెస్ట్ గా అయితే ఈ సినిమా విషయంలో ఓ ఆసక్తికర నిజం తెలిసింది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిష నటించగా వారిద్దరి కెమిస్ట్రీ సినిమాలో పెద్ద హైలైట్ గా నిలిచింది. అయితే అసలు ఈ సినిమాకి మొదట ప్రభాస్ సరసన హీరోయిన్ గా అనుకున్నది త్రిషని కాదట. ఆమె ప్లేస్ లో మొదట అప్పటి యంగ్ హీరోయిన్ అదితి అగర్వాల్ ని అనుకున్నారట.

అల్లు అర్జున్ తో “గంగోత్రి” సినిమాలో మెరిసిన ఈ నటిని మొదటిగా అనుకోగా తర్వాత పలు కారణాల చేత ఆమె స్థానంలో త్రిష చేరింది. ఇక తర్వాత సినిమా వచ్చి ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సెన్సేషనల్ మ్యూజిక్ ఆల్బమ్ ఈ సినిమాని మరో స్థాయిలో నిలిపింది. ఈ సినిమాకి ఎం ఎస్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు