మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని

మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని

Published on Apr 26, 2024 2:00 AM IST


యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కమల్ హాసన్ ఇప్పుడు వరకు ఎన్నో భాషల్లో ఎన్నో చిత్రాలు చేశారు. అలా మన తెలుగులో కూడ పలు చిత్రాలు చేయగా వాటిలో దిగ్గజ దర్శకులు దివంగత కే విశ్వనాథ్ గారితో చేసిన ఆణిముత్యం లాంటి సినిమా “శుభ సంకల్పం” కూడా ఒకటి.

అయితే ఈ సినిమాలో ఆమని అలాగే మరో నటి ప్రియా రామన్ లు కనిపిస్తారు. మరి ఈ ఇద్దరిలో ఒకరి పాత్ర అలనాటి స్టార్ నటి సౌందర్య చేయాల్సింది అని మీకు తెలుసా? అవును వారిద్దరిలో మొదటిగా ప్రియా రామన్ పాత్రకి సౌందర్యనే అనుకున్నారట. అంతే కాకుండా ఇదే కమల్ తో సౌందర్యకి మొదటి సినిమా కావాల్సి ఉండేది. కానీ పలు కారణాలు చేత అప్పట్లో సాధ్యం కాలేదు.

దీనితో వీరి కాంబినేషన్ లో మొదటి సినిమాగా “నవ్వండి లవ్వండి” కుదిరింది. తెలుగులో శుభ సంకల్పం చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి కీరవాణి ఇచ్చిన ఆల్బమ్ కూడా ఒక ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ లో ఒకటిగా నిలిచింది. మరి ఈ చిత్రాన్ని బాల సుబ్రహ్మణ్యం నిర్మించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు