రీసెంట్ గా సంక్రాంతి కానుకగా వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్లో చేసిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు కూడా ఒకటి. ఇక ఈ సినిమా తోనే మరో క్లీన్ హిట్ గా నిలిచిన చిత్రమే అనగనగా ఒక రాజు. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో దర్శకుడు బాబీ మెగాస్టార్ కి ఇప్పుడు జెనరేషన్ లో బాగా ఇష్టమైన హీరో ఎవరో రివీల్ చేశారు.
తనకి నచ్చిన హీరో మరెవరో కాదట. తనతో సంక్రాంతి బరిలో వచ్చి హిట్ కొట్టిన స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టినే మెగాస్టార్ కి ప్రస్తుత జెనరేషన్ ఫేవరేట్ హీరో అట. ఈ మేటర్ మెగా డైరెక్టర్ ద్వారా ఇప్పుడు బయటకి వచ్చింది. ప్రస్తుతం బాబీతో మెగాస్టార్ ఓ భారీ యాక్షన్ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
