
‘బస్ స్టాప్’, ‘రొమాన్స్’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రిన్స్ హీరోగా నిఖితా పవార్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘డాలర్స్ కాలనీ’. రొమాంటిక్ హర్రర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా శ్రీ చంద్ ముల్లా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రెండు పాటల మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఎస్. రత్నమయ్య – టి. గణపతిరెడ్డి కలిసి ఈ సినిమాని నిర్మించారు.
‘రొమాంటిక్ హర్రర్ గా తెరకెక్కే ఈ సినిమాలో కామెడీ కూడా ఎక్కువగానే ఉంటుంది. గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచే ఈ మూవీలో ప్రిన్స్ కొత్త లుక్ లో కనిపిస్తాడు. జూలై 10కల్లా షూటింగ్ ని పూర్తి చేసి ఆగష్టులో రిలీజ్ చేస్తున్నామని’ ఈ చిత్ర నిర్మాతలు తెలియజేశారు.