‘డాన్ 3’ : భారీ అప్ డేట్ కు రెడీ

‘డాన్ 3’ : భారీ అప్ డేట్ కు రెడీ

Published on Feb 20, 2024 12:39 AM IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన డాన్ 1, 2 సినిమాలు రెండూ కూడా మంచి సక్సెస్ లు అందుకున్నాయి. ఇక డాన్ గా ఐకాన్ రోల్ లో షారుఖ్ అదరగొట్టడంతో పాటు ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో ఆ పాత్ర ద్వారా స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా ఆ సిరీస్ లోని మూడవ మూవీ అయిన డాన్ 3లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించనున్నట్లు ఇటీవల ఒక అనౌన్స్ మెంట్ వీడియో వచ్చింది.

అయితే షారుఖ్ చేసిన ఆ పాత్రలో రణ్వీర్ ఎంతవరకు మెప్పిస్తారు అనే ఆసక్తి అందరిలో ఉంది. విషయం ఏమిటంటే, నేడు ఈ మూవీ నుండి ఒక భారీ అప్ డేట్ రానుంది అంటూ మేకర్స్ నిన్న ఒక అనౌన్స్ మెంట్ అందించారు. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ సంయుక్తంగా గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ మూవీకి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందించనుండగా ఈ మూవీని కూడా ఫర్హాన్ తెరకెక్కించనున్నారు. ఇక 2025 లో ఈ మూవీని ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. మరి డాన్ 3 నుండి రానున్న ఆ భారీ అప్ డేట్ ఏమిటనేది తెలియాలి అంటే మరికొన్ని గంటల వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు