“దొరసాని” ఫస్ట్ లుక్: కోటలోని రాణితో తోటరాముడి ప్రేమకథ

Published on May 30, 2019 1:33 pm IST

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ల “దొరసాని”మూవీ ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది. ఆనంద్ సైకిల్ పై వెంబడిస్తుంటే, కారులో గుమ్మనంగా చూపు మరల్చకుండా కూర్చున్న శివాత్మిక ల ఫోటో సినిమా కథ మొత్తం చెప్పకనే చెవుతుంది.

దశాబ్దాల కిందట ఉన్న బానిస బతుకులు, పేద ధనిక తేడాలు, కుల మత వర్ణ వైషమ్యాల మధ్య గొప్పింటి దొరసానికి, పేదింటి రాజుకి మధ్య నడిచే ప్రేమ, దాని పర్యవసానాల సమాహారమే “దొరసాని” చిత్రం.

ఈ మూవీకి దర్శకత్వం వహించిన కె వి మహేంద్ర నాటి తెలంగాణా సామాజిక పరిస్థులను, సంప్రదాయాలు,కట్టుబాట్లను చక్కగా తెరకెక్కించాడని సమాచారం. జులై 5 న విడుదల కానున్న ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ మరియు బిగ్ బెన్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More