“డబుల్ ఇస్మార్ట్” డోస్ సరిపోలేదా?

“డబుల్ ఇస్మార్ట్” డోస్ సరిపోలేదా?

Published on May 18, 2024 4:00 PM IST


టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ క్రేజీ మాస్ చిత్రం “డబుల్ ఇస్మార్ట్” కోసం అందరికీ తెలిసిందే. మరి రామ్ కి మాస్ లో సాలిడ్ క్రేజ్ ని తెచ్చి పెట్టిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తున్నా ఈ సినిమా నుంచి రీసెంట్ గానే మేకర్స్ అవైటెడ్ టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది కానీ మాస్ ఆడియెన్స్, ఈ సినిమా లవర్స్ కి మాత్రం డోస్ సరిపోలేదనే వినిపిస్తుంది.

పార్ట్ 1 లో చూసిన మ్యాజిక్ ఇంకాస్త ఎక్కువ ఉండుంటే బాగుణ్ణు అనుకున్న వారే ఎక్కువ ఉన్నారని చెప్పాలి. మరి వీటితో సినిమాపై మరింత హైప్ కావాలి అంటే పూరి అండ్ కో ముందు రోజుల్లో మరింత క్రేజీ స్టఫ్ ని అందించాల్సిందే. మరి చూడాలి ఎలాంటి అప్డేట్స్ అందిస్తారో అనేది. ఇక ఈ భారీ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తుండగా సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు అలాగే మణిశర్మ సంగీతం అందిస్తుండగా పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు