జూన్ 14న థియేటర్ల లోకి “డబుల్ ఇస్మార్ట్”?

జూన్ 14న థియేటర్ల లోకి “డబుల్ ఇస్మార్ట్”?

Published on Feb 16, 2024 2:00 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం అంతకుముందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని మార్చ్ 8 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం ను మేకర్స్ జూన్ 14 వ తేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పలు కారణాల వలన సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం మరి అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు