‘రాజశేఖర్’ ఆశలన్నీ శేఖర్ పైనే !

Published on Jul 4, 2021 1:48 am IST

సీనియర్ హీరో ‘రాజశేఖర్’ ప్రస్తుతం నటిస్తున్న మూవీ… శేఖర్. చాలా గ్యాప్ తర్వాత ఈ రీమేక్ చేస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన ఒక క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా ఈ ‘శేఖర్’ మూవీ రాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు కానుందని.. రాజశేఖర్ పై సోలో సాంగ్ షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అను సితార, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక రాజశేఖర్ కి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా హిట్ కావాలి, అందుకే ఈ సినిమా కోసం కొన్ని రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నాడట ఈ సీనియర్ హీరో. నిజానికి ‘గరుడవేగ’తో రాజశేఖర్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది. కానీ, ఆ తర్వాత విడుదలైన ‘కల్కి’తో ఆ క్రేజ్ పోవడంతో రాజశేఖర్ ఈ శేఖర్ సినిమా పైనే ఆశలు అన్ని పెట్టుకున్నాడు. ఈ సినిమా అవుట్ ఫుట్ పై గట్తి నమ్మకంతోనే ఉన్నాడు. సినిమా కూడా బాగానే వస్తోందట.

సంబంధిత సమాచారం :