ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఎన్టీఆర్, ఇతర తారాగణంపై వీటిని తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తోంది. ఆయన తీసిన కేజిఎఫ్, సలార్ ఇలాగే సాగాయి. కాబట్టి, ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కూడా ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ పిక్చరైజేషన్ తోనే ఉంటుందని అందరూ అనుకున్నారు.
కానీ, ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట. పైగా బ్లాక్ షేడ్ ఫ్రేమ్ కూడా సినిమాలో కనిపించదట. మరి ప్రశాంత్ నీల్ అంత కలర్ ఫుల్ గా ఏం తీస్తున్నాడో చూడాలి. ఈ సినిమాను నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 11న థియేటర్లలో విడుదల కానుంది.
