KEY TAKEAWAYS (ముఖ్య అంశాలు)
- మే 21న ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
- థియేటర్లలో ఆడియన్స్ ఫుట్ ఫాల్స్ బాగా తగ్గిపోయిన ప్రస్తుత డ్రై సీజన్‌లో, ఈ సైలెంట్ రిలీజ్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద రిస్క్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
- క్యూరియాసిటీ క్రియేట్ చేయాల్సిన ట్రైలర్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపకపోవడంతో, ఈ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ఓపెనింగ్స్ పై టెన్షన్ నెలకొంది.
థియేటర్లలో సందడి తగ్గిపోయిన డ్రై సీజన్ నడుస్తోంది. ఇలాంటి టైమ్‌లో ఒక బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ సినిమా సైలెంట్‌గా రావడం ట్రేడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే ‘దృశ్యం 3’. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా మూడో భాగం తెలుగు వెర్షన్ మే 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా, యూనిట్ వైపు నుంచి ఎలాంటి హడావిడీ కనిపించడం లేదు. అసలు ఈ సినిమా వస్తుందనే విషయం సగటు ప్రేక్షకుడికి ఇంకా చేరలేదు.
ప్రస్తుత బాక్సాఫీస్ పరిస్థితి చూస్తే, సరైన ప్రమోషన్స్ చేస్తే తప్ప జనాలు థియేటర్ల వైపు చూసే పరిస్థితి లేదు. ఇలాంటి టైమ్‌లో ఇంత వీక్ ప్రమోషనల్ స్ట్రాటజీతో బరిలోకి దిగడం కచ్చితంగా పెద్ద రిస్క్. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మేకర్స్‌దే. కానీ ఆ దిశగా యూనిట్ కనీస ఎఫర్ట్ పెట్టకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల విడుదల చేసిన తెలుగు వెర్షన్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ చూపలేకపోయింది. ట్రైలర్ కట్ చేసిన విధానంలో ఎలాంటి థ్రిల్ లేకపోవడంతో, అది వచ్చిన విషయం కూడా చాలామందికి రిజిస్టర్ కాలేదు.
దృశ్యం లాంటి పవర్ ఫుల్ బ్రాండ్ చేతిలో ఉన్నప్పుడు, దాన్ని క్యాష్ చేసుకోవడంలో మేకర్స్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ సైలెంట్ రిలీజ్ వెనుక ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా.. లేక ప్రమోషన్స్ గాలికి వదిలేశారా అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. సినిమా కంటెంట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా, కేవలం బ్రాండ్ నేమ్ చూసి జనాలు థియేటర్లకు వచ్చేస్తారనుకోవడం పొరపాటే. సరైన బజ్ క్రియేట్ చేయకుండా ఈ డ్రై సీజన్‌లో థియేటర్లలోకి వస్తే, మంచి కంటెంట్ ఉన్నా ఓపెనింగ్స్ పరంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. లాస్ట్ మినిట్‌లో అయినా టీమ్ మేల్కొంటుందేమో చూడాలి.
