కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విక్టరీ వెంకటేష్ ఈ సారి కుటుంబ కథకి కొన్ని థ్రిల్లింగ్ మోమెంట్స్ జత చేసి చేసిన సినిమా ‘దృశ్యం’. ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కానీ ఈ చిత్ర నిర్మాతలు ఇప్పటికే పలువురుకి ఈ సినిమాని స్పెషల్ గా చూపించడం వలన చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు..
వివి వినాయక్ – సినిమా చాలా బాగుంది. వెంకటేష్ గారు ఒక మధ్య తరగతి ఫ్యామిలీ మాన్ లా చాలా బాగా చేసారు.
మారుతి – సినిమా సూపర్బ్ గా ఉంది. వెంకటేష్ గారు చేసిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో ఓ ట్రెండ్ సెట్ చేస్తుంది.
దశరథ్ – దృశ్యం చాలా మంచి కథ, కొత్త కథ, గొప్ప కథ. అలాగే వెంకటేష్ పెర్ఫార్మన్స్ చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. కుటుంబం మొత్తం కలిసి చూడదగిన సినిమా ‘దృశ్యం’.
బెల్లంకొండ సురేష్ – దృశ్యం చాలా బాగుంది. చాలా పెద్ద రేంజ్ లో హిట్ అవుతుంది. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం తర్వాత మళ్ళీ తన ఫ్యామిలీ కోసం స్ట్రగుల్ అయ్యే పాత్రలో వెంకటేష్ బాబు చాలా బాగా చేసాడు. వెంకటేష్ బాబు కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది.
బెనర్జీ – సినిమా సింప్లీ సూపర్బ్. ప్రతి ఫ్యామిలీ ఈ సినిమాకి తమ కొడుకులని తీసుకెళ్ళి ఈ సినిమా చూపించాలని కోరుకుంటున్నాను.
ఉత్తేజ్ – ఈ సినిమా థియేటర్ లో చూసే ప్రతి ఒక్కరికీ బాగా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నది నా ఫ్యామిలీ అని ఫీలయ్యేలా ఈ సినిమా ఉంటుంది.
ట్విట్టర్ ద్వారా ప్రశంశలు ..
సుమంత్ – వెంకీ బావ, సురేష్ బావకి శుభాకాంక్షలు.. తెలుగు సినిమాకి సంబందించని ఓ జోనర్ సినిమాని తీసి అందరి నుంచి సూపర్బ్ రిపోర్ట్స్ అందుకోవడం చాలా గ్రేట్..
అఖిల్ – దృశ్యం సినిమా చూసాను. సెకండాఫ్ అదిరిపోయింది. సూపర్బ్ స్క్రీన్ ప్లేతో సినిమాని రన్ చేసారు. వెంకటేష్ అంకుల్ నటన చాలా బ్రిలియంట్ గా ఉంది. సురేష్ బాబు అంకుల్ కి కూడా శుభాకాంక్షలు..


