చిక్కుల్లో పడ్డ కమల్ ‘దృశ్యం’ రీమేక్

Kamalhaasan's

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘దృశ్యం’ సినిమాని తమిళంలో రీమేక్ చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబందించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఎర్నాకులం కోర్టు ఈ సినిమా షూటింగ్ ఆపేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది. దీనికి కారణం ఈ సినిమాపై సతీష్ పాల్ కేసు నమోదు చేయడమే..

అసలు విషయంలోకి వెళితే.. సతీష్ పాల్ రచించి మే 2013లో ప్రచురించిన ‘ఒరు మజాకలతు’ అనే బుక్ నుంచి దృశ్యం సినిమాని కాపీ కొట్టారని ఎర్నాకులం కోర్టులో కేసు వేసాడు. దాంతో కోర్టు తమిళ దృశ్యం షూటింగ్ ఆపేయాలని ఆర్డర్స్ వేసింది. దాంతో షూటింగ్ ని నిలిపివేశారు.

‘దృశ్యం’ ఒరిజినల్ వెర్షన్ మలయాళంలోనే వచ్చింది. ఆ తర్వాత కన్నడ, తెలుగులో కూడా రీమేక్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇన్ని రోజులు లేని ఇబ్బందిని తమిళంకి వచ్చేసరికి తెరపైకి తేవడంతో ఎవరో కావాలనే చేస్తున్నారని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి కోర్టు తొందర్లోనే స్టే ఎత్తేసి కమల్ సినిమా షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో చూడాలి..

Exit mobile version