త్వరలో ప్రారంభంకానున్న దృశ్యం హిందీ రీమేక్

ajaydevagan
మళయాళ మాతృకలో ఘనవిజయం సాధించి తెలుగు, తమిళ చిత్ర సీమలకు వచ్చిన దృశ్యం సినిమా త్వరలో హిందీలో సైతం రీమేక్ అవ్వనుంది. తెలుగులో వెంకటేష్ పోషించిన ఈ పాత్రని హిందీలో అజయ్ దేవగన్ పోషించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి చివరికి షూటింగ్ ప్రారంభంకానుంది.

నిషికంట్ కామత్ ఈ సినిమాకు దర్శకుడు. వయకామ్18 సంస్థ నిర్మిస్తుంది. తమిళ దృశ్యాన్ని కమల్, గౌతమీ లు ముఖ్యపాత్రధారులు. హిందీ రిమేక్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

Exit mobile version