
విక్టరీ వెంకటేష్ వరుసగా రీమేక్ సినిమాలపై దృష్టి సారించాడు. తను చివరిగా చేసిన ‘మసాలా’ సినిమా హిందీ రీమేక్. వెంకీ ప్రస్తుతం చేస్తున్న సినిమా కూడా మళయాళ సినిమా ‘దృశ్యం’కి రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ భాగ్యనగరంలో శరవేగంగా జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ లో సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న అందరూ పాల్గొంటున్నారు.
ఈ మూవీలో వెంకటేష్ కి జోడీగా మీనా కనిపించనుంది. లేడీ డైరెక్టర్ శ్రీ ప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారు. డి. సురేష్ బాబు – రాజ్ కుమార్ థియేటర్స్ – వైడ్ యాంగిల్ క్రియేషన్స్ వారు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
వెంకటేష్ ఈ సినిమా తరవా పవన్ కళ్యాణ్ తో కలిసి ‘ఓ మై గాడ్’ రీమేక్ లో నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 19 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

