‘ఎవడో ఒకడు’ పని మొదలుపెట్టిన దేవిశ్రీ

devisri-prasad
దేవిశ్రీ ప్రసాద్.. ప్రస్తుతం తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అభిమానుల మన్ననలు పొందుతూ దూసుకుపోతోన్న రాకింగ్ స్టార్. వరుస హిట్స్‌తో యూత్‌లో పిచ్చ క్రేజ్ సంపాదించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్, ఈమధ్యే విడుదలైన ‘కుమారి 21F’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ స్టార్, తాజాగా రవితేజ హీరోగా రూపొందనున్న ‘ఎవడో ఒకడు’ అన్న సినిమాకు కూడా సంగీత దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే.

దిల్‌రాజు నిర్మాణంలో ‘ఓ మై ఫ్రెండ్’ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని దేవిశ్రీ ప్రసాద్ అప్పుడే మొదలుపెట్టేశారు. రవితేజను ఓ డిఫరెంట్ లుక్‌లో పరిచయం చేస్తూ రూపొందనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ఓ ఫ్రెష్ ఆల్బమ్‌ను అందించేందుకు కృషి చేస్తున్నారు. రవితేజ సరసన హీరోయిన్‌గా నటించేందుకు ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ ఎంపిక కాగా, మరో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

Exit mobile version