కుమారి 21F కి దేవీశ్రీ ట్యూన్సే హైలైట్

kumari-21-f
డిఫరెంట్ పాత్రలను సృష్టించి, వాటికి ఓ చిత్రమైన స్క్రీన్‌ప్లే ని జోడించి సినిమాలు తీసి తెలుగులో టాప్ డైరెక్టర్‌‌లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి తను రాసుకొని డైరెక్ట్ చెయలకపొఉన్న కొన్ని కథల్ని అలాగే కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సొంత ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసాడు. అనుకున్న వెంటనే సుకుమార్ తన సొంత బ్యానర్‌పై ‘కుమారి 21F’ అనే సినిమాను మొదలెట్టాడు. ఈ సినిమాకు సుకుమార్ స్వయంగా కథ – స్క్రీన్‌ప్లే అందించి, పల్నాటి సూర్య ప్రతాప్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఇందులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ హీరోగా, హీబా పటేల్ హీరోయిన్‌గా కనిపించనున్నారు.

ఇటీవలే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ నెల 31న జరగనున్న గ్రాండ్ ఆడియో లాంచ్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఆడియోని రిలీజ్ చేయనున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ ఆడియో సినిమాకే స్పెషల్ హైలైట్ అవుతుందని అంటున్నారు. కుమారి 21F కోసం దేవీశ్రీ సూపర్బ్ యూత్ ఆల్బమ్ ఇచ్చాడని అందరూ అంటున్నారు. సుకుమార్ స్టైల్ నెరేషన్‌తో ఓ సరికొత్త ప్రేమకథగా ఈ సినిమా రూపొందిన ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

Exit mobile version