విజయ్ ‘సర్కార్’ టీజర్ విడుదలకు ముహూర్తం కుదిరింది !

విజయ్ ‘సర్కార్’ టీజర్ విడుదలకు ముహూర్తం కుదిరింది !

Published on Aug 18, 2018 1:18 AM IST


ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న 62 వ చిత్రం ‘సర్కార్’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. మురగదాస్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. అన్ని కుదిరితే సెప్టెంబర్ 13న వినాయక చవితి కానుకగా ఈచిత్రం యొక్క టీజర్ ప్రేక్షకులముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తుంది.

పొలిటికల్ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇక తుపాకీ, కత్తి చిత్రాల తరువాత విజయ్ -మురుగదాస్ కలయికలో రూపొందుతున్న ఈచిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా దీపావళి కానుకగా తెలుగు , తమిళ భాషల్లో ఒకేసారి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు