స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా చివరి దశ షూటింగ్ హైదరబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే అల్లు అర్జున్ – సమంతలపై సిటీ అవుట్ స్కర్ట్స్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. ఫిబ్రవరి 5న ఈ సినిమా రిలీజ్ చెయ్యాలి అనుకోవడంతో జనవరి లోపు మిగిలినా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేయాలనుకుంటున్నారు.
అందులో భాగంగా న్యూ ఇయర్ రోజున త్రివిక్రమ్ – బన్ని సినిమా డబ్బింగ్ వర్క్ ని శబ్దాలయా స్టూడియోస్ లో ప్రారంభించారు. ముందు ఈ సినిమాలో కీలక పాత్రలు చేసిన వారు డబ్బింగ్ చెప్తారు జనవరి సెకండ్ వీక్ నుంచి అల్లు అర్జున్ డబ్బింగ్ మొదలు పెట్టనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో ఫైట్స్ అన్నీ చాలా స్టైలిష్ గా ఉండేలా కేర్ తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో స్పోర్ట్స్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో బన్ని మొదటి సారిగా ముగ్గురు భామలతో ఆడిపాడుతున్నాడు. ఆ అందాల భామలే సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్. వీరితో పాటు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, స్నేహ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. గతంలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ – రాధాకృష్ణ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.


