
సినిమా ప్రారంభం అయ్యేటప్పుడే ఆ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తే.. అనుకున్న టైంకి రిలీజ్ చెయ్యడం కోసం అన్ని పనులను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. అదీ స్టార్ హీరోల సినిమా అయితే అస్సలు లైట్ తీసుకోకూడదు, చాలా పర్ఫెక్ట్ గా అన్ని వర్క్స్ ఫినిష్ చెయ్యాలి. చూస్తుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా విషయంలో చిత్ర టీం అంతా ఇదే ఫాలో అవుతున్నట్టున్నారు. రామ్ చరణ్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇప్పటి వరకూ 60% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది.
ఈ చిత్ర టీం సినిమా మొదలైన రోజే దసరా కానుకగా ఈ మూవీని రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. దాని ప్రకారమే ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టింది. ఈ రోజు హైదరాబాద్లోని శబ్దాలయ స్టూడియోస్ లో అధికారికంగా డబ్బింగ్ పనులని స్టార్ట్ చేసారు. రేపటి నుంచి ఈ సినిమాలోని నటీనటులు తమ పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ పనులను మొదలు పెట్టనున్నారు. రామ్ చరణ్ తన పార్ట్ కి కి సంబందించిన టాకీ పార్ట్ పూర్తి కాగానే డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాడు. డబ్బింగ్ తో పాటు ఎడిటింగ్ వర్క్ కూడా జరుగుతోంది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా డివివి దానయ్య నిర్మాత.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా ఆగష్టు 22న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర టీం మెరుపు, ఫైటర్, బ్రూస్ లీ, విజేత అనే టైటిల్స్ ని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు.

