‘భారతీయుడు 2’ లోకి యువ హీరో ?

‘భారతీయుడు 2’ లోకి యువ హీరో ?

Published on Nov 11, 2018 4:00 AM IST

కమల్ హాసన్, శంకర్ కలయికలో సూపర్ హిట్ చిత్రం ‘భారతీయుడు’ కి సీక్వెల్ గా ‘భారతీయుడు 2’ రూపొందనున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో మలయాళ యువ హీరో దుల్కర్ సల్మాన్ ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడని సమాచారం. అలాగే ఈచిత్రంలో నయన తార , కాజల్ కథానాయికలుగా నటించనున్నారని దుల్కర్ సల్మాన్ కు జోడిగా కాజల్ అలాగే కమల్ సరసన నయన తార కనిపించనున్నారని చెన్నై సినీ వర్గాల సమాచారం.

ఇక శంకర్ ప్రస్తుతం ‘2.0’ చిత్రం విడుదల పనుల్లో బిజీ గా వున్నాడు. ఆ చిత్రం విడుదల తురువాత భారతీయుడు 2 చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ యూఎస్ లో జరిగే అవకాశాలు వున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు