‘గాయపడ్డ సింహం’ కోసం వస్తున్న దుల్కర్..!

‘గాయపడ్డ సింహం’ కోసం వస్తున్న దుల్కర్..!

Published on Apr 24, 2026 10:02 PM IST

Gaayapadda-Simham-1

తరుణ్ భాస్కర్ హీరోగా దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘గాయపడ్డ సింహం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను మే 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 25న నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.

ఇక ఈ ట్రైలర్ లాంచ్‌కు చీఫ్ గెస్ట్‌గా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 25న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని AAA సినిమాస్‌లో జరగనున్న ఈ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. దీంతో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అయ్యింది.

ఇక కళ్యాణ్ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప మరియు ఇతరులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ ట్రైలర్ ఈ మూవీపై ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Dulquer-Salmaan

తాజా వార్తలు