మరో క్రేజీ కాంబినేషన్ నుంచి తప్పుకున్న దుల్కర్?

మరో క్రేజీ కాంబినేషన్ నుంచి తప్పుకున్న దుల్కర్?

Published on Apr 13, 2024 11:15 AM IST

మళయాళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ఇప్పుడు భాషా భేదం లేకుండా పలు చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్ గానే మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో చేస్తున్న “లక్కీ భాస్కర్” (Lucky Bhaskar) టీజర్ తో ఒక ఊహించని థ్రిల్ ని అందించిన తాను ఈ సినిమాతో తెలుగులో మరో హిట్ కొట్టబోతున్నాడు అనిపించింది.

అయితే దుల్కర్ సల్మాన్ హీరోగానే కాకుండా పలు చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అలా పలు క్రేజీ కాంబినేషన్ లలో తన పేరు లాక్ అయ్యింది. కానీ అనూహ్యంగా వాటిలో మొదటిగా అనుకున్న చిత్రం కమల్ హాసన్ చేస్తున్న “థగ్ లైఫ్” (Thug Life) నుంచి తాను తప్పుకున్నాడు. అలాగే బాలయ్య 109 (NBK 109) నుంచి కూడా పలు కారణాలు చేత తప్పుకున్నట్టుగా రూమర్స్ వచ్చాయి.

ఇక ఇపుడు మూడో సినిమాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆలాగే దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా నుంచి కూడా దుల్కర్ బయటకి వచ్చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్ల కితమే ఈ సినిమా లేట్ అవుతుంది అని సూర్య క్లారిటీ ఇచ్చాడు. దీనితో ఇదెప్పుడు మొదలవుతుందో అర్ధం కానుందని దుల్కర్ వేరే ప్రాజెక్ట్స్ కి కమిట్ అయ్యినట్టుగా బజ్. మరి మళ్ళీ సూర్య సినిమాలోకి వస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు