‘నా సామిరంగ’ నుండి ‘దుమ్ము దుకాణం’ వీడియో సాంగ్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

‘నా సామిరంగ’ నుండి ‘దుమ్ము దుకాణం’ వీడియో సాంగ్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

Published on Jan 25, 2024 7:42 PM IST

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా రాజ్ తరుణ్, అల్లరి నరేష్, రుక్సార్ థిల్లాన్, మిర్నా ఇతర కీలక పాత్రల్లో విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది.

ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇక ఈ మూవీకి కీరవాణి అందించిన సాంగ్స్ కూడా ఆడియన్స్ ని అలరించాయి. విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి మంచి మాస్ నెంబర్ అయిన దుమ్ము దుకాణం వీడియో సాంగ్ ని రేపు సాయంత్రం 5 గం. లకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మరి నా సామిరంగ మూవీ ఓవరాల్ గా ఎంతమేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు