ఒక్క టికెట్ ధర 90వేలు.. ఎగబడి కొనుక్కుంటున్న ఫ్యాన్స్..!

dune3

హాలీవుడ్ విజువల్ వండర్ ‘డ్యూన్ 3’ (Dune 3) మేనియా ప్రపంచవ్యాప్తంగా అప్పుడే మొదలైపోయింది. ఈ ఏడాది డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఐమ్యాక్స్ 70mm టికెట్లు బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి. ప్రస్తుతం రీసేల్ మార్కెట్‌లో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ. 90,000 వరకు పలుకుతుండటం చూస్తుంటే, ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
​అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఈ సినిమా టికెట్ల కోసం భారీ పోటీ నెలకొంది.

సాధారణంగా సినిమా టికెట్ ధరలు అందుబాటులో ఉంటాయి, కానీ ‘డ్యూన్ 3’ ఐమ్యాక్స్ ఎక్స్‌పీరియన్స్ కోసం డైహార్డ్ ఫ్యాన్స్ లక్షల్లో ఖర్చు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. ఇంత భారీ ధర పెట్టి సినిమా చూడటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, ఆ విజువల్ గ్రాండియర్ కోసం ఆ మాత్రం ఖర్చు చేయక తప్పదని సినిమా ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

​ఈ టికెట్ ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ఐమ్యాక్స్ 70mm స్క్రీన్స్ కొరత. అమెరికా మరియు యూకే మొత్తం కలిపి కేవలం 19 లొకేషన్లలో మాత్రమే ఈ స్పెషల్ ఫార్మాట్ అందుబాటులో ఉంది. స్క్రీన్స్ తక్కువగా ఉండటం, డిమాండ్ విపరీతంగా ఉండటంతో బ్లాక్ మార్కెట్‌లో టికెట్ల రేట్లు చుక్కలనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో, తక్షణమే ఐమ్యాక్స్ 70mm స్క్రీన్ల సంఖ్యను పెంచాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version