మాసొడి సిసలైన జాతర…30 కోట్లతో ఈగిల్!

మాసొడి సిసలైన జాతర…30 కోట్లతో ఈగిల్!

Published on Feb 12, 2024 2:25 PM IST


మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఈగిల్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. రవితేజ ఈ సినిమా లో సహదేవ్ వర్మ పాత్రలో నటించి, ఆడియెన్స్ ను అలరించారు. ఈ పాత్రకి అన్ని చోట్ల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే 30.6 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది.

రవితేజ సిసలైన మాస్ జాతర ఇది అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. లాంగ్ రన్ లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు