“ఈగిల్” స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకున్న ఈటీవీ విన్!

“ఈగిల్” స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకున్న ఈటీవీ విన్!

Published on Feb 23, 2024 5:12 PM IST

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఈగిల్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని ఆకట్టుకుంది. ఈ చిత్రం కి సంబందించిన స్ట్రీమింగ్ రైట్స్ పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం యొక్క స్ట్రీమింగ్ రైట్స్ ను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి దావ్ జంద్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు