నాల్గో రోజు స్ట్రాంగ్ హోల్డ్ తో “ఈగిల్”

నాల్గో రోజు స్ట్రాంగ్ హోల్డ్ తో “ఈగిల్”

Published on Feb 12, 2024 10:03 PM IST

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఈగిల్. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. సినిమాకి తొలి షో నుండే పాజిటివ్ టాక్ రావడం తో మూడు రోజుల్లోనే 30 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే సోమవారం నాడు కూడా చాలా ప్రాంతాల్లో సినిమా సూపర్ హోల్డ్ ను కనబరుస్తోంది. ఈ చిత్రం నాల్గో రోజు మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.

రవితేజ ఈ చిత్రం లో తన రోల్ తో ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటున్నారు. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా ను మళ్ళీ చూసేలా చేస్తున్నాయి. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు