2 రోజుల్లో 20 కోట్లతో “ఈగిల్”

2 రోజుల్లో 20 కోట్లతో “ఈగిల్”

Published on Feb 11, 2024 6:38 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఈగిల్. ఈ చిత్రం ఫిబ్రవరి 9, 2024 న వరల్డ్ వైడ్ గా తెలుగు మరియు హిందీ భాషల్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 12 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టగా, రెండో రోజు 9 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా రెండు రోజుల్లో 20.9 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది.

నేడు ఆదివారం కావడం తో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. లాంగ్ రన్ లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు